Sunday, May 11, 2025
Homeఖమ్మంఅంగన్వాడీల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలి..

అంగన్వాడీల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలి..

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : భూగర్భజలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు ఆవశ్యకత ఎంతైనా ఉందని, అందుకోసం ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో ఇంకుడు గుంత నిర్మించాలని డి.డబ్ల్యు.వో లెనినా అన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని ఐసీడీఎస్ కార్యాలయాన్ని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ లతో సంస్థ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఫైర్ కాలనీ అంగన్వాడి కేంద్రంలో ఇంకుడు గుంతను పరిశీలించారు. అమ్మ సేవాసదనం తనిఖీ చేసారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో ముత్తమ్మ,సూపర్వైజర్ విజయలక్ష్మి,సౌజన్య,వరలక్ష్మి రమాదేవి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -