Saturday, October 4, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
ఇటీవల నీట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఎంబీబీఎస్ అడ్మిషన్ సీటును సాధించిన జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన తుడుం సుజాత-రమేష్ కుమార్తె తుడుం సంజీవనినీ నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత ఘనంగా శాలువాతో సత్కరించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ప్రసాద్ నేత మాట్లాడుతూ.. కవ్వాల్ గ్రామంలోనే నేతకాని సమాజంలో మొట్టమొదటి మెడిసిన్ అడ్మిషన్ సాధించిన విద్యార్థినిగా సంజీవనినీ అభినందించారు. సాధారణ కుటుంబానికి చెందిన విద్యార్థిని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకొని నీట్ లో ఉత్తీర్ణత సాధించడం నిజంగా హర్షించదగ్గ విషయమని ముందుగా వారి తల్లిదండ్రులకు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

రానున్న రోజుల్లో మరిన్ని ఉత్తమ ఫలితాలు కవ్వాల్ గ్రామం నుండి సాధించాలని ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులను ఆకాంక్షించారు. పిల్లలు అద్భుత విజయాలను సాధించినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ జాడి గంగాధర్, నేతకాని కులసంఘ నాయకులు రామటేంకి శంకర్, సాయిని సాయికుమార్, నీలం వెంకటేష్,తుడుం శేఖర్, రాము, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -