అసలైన కార్యకర్తకు గుర్తింపు ఎక్కడ..
జంపు జలానీలకే టికెట్లు ఇచ్చేందుకు పార్టీల మొగ్గు..
నవతెలంగాణ – మద్నూర్
ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు పార్టీల్లో గుర్తింపు కరువైందన్న వాదనలు అన్ని పార్టీల్లో చర్చించుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తింపు ఇవ్వకుండా డబ్బులు ఉన్న వ్యక్తుల వైపే అన్ని పార్టీలు ముగ్గు చూపుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా.. పార్టీలకు కట్టుబడి ఏళ్ల తరబడి జెండాలు మోస్తూ పనిచేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు లేకుండా పోతోందని స్థానిక నాయకులు ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.
తరచూ పార్టీలు మారుతున్న వారికే టికెట్లు ఇవ్వడానికి అధిస్థానం మోగ్గు చూపుతోందని వినికిడి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. డబ్బున్న వ్యక్తులు, జెండాలు మోయని వారు టికెట్లు ఆశిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కులాల వారీగా లెక్కలు వేస్తూ ఏ కులం వారికి టికెట్ ఇస్తే విజయం సాధిస్తారని వాటిపైన కూడా పార్టీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. డబ్బున్న వ్యక్తుల వైపు పార్టీలు మొగ్గుచూపడంతో కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బే ముఖ్యం అనే విధంగా పార్టీల హైకమాండ్ల ఆలోచన స్థానిక సీనియన్ నాయకలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
జెండా మోసిన కార్యకర్తలకు పార్టీల్లో గుర్తింపు కరువు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES