నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల పశు వైద్య ఆస్పత్రిలో డాక్టర్ ఉండరు. అటెండర్ వైద్యంతో పశువుల రోగాలు తగ్గడం లేక చనిపోతున్నాయంటూ పశువులదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. శనివారం రోగాల బారిన పడిన పశువులకు పశువులదారులు మండల కేంద్రంలోని పశువైద్య ఆస్పత్రికి తీసుకువస్తే అక్కడ అటెండరే వైద్యునిగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పుడే కాదు.. ఆస్పత్రిలో డాక్టర్ కనిపించేది తక్కువ.. అటెండర్ కనిపించేది ఎక్కువ. అటెండర్ చేసే తెలిసీ తెలియని వైద్యానికి వశువులు చనిపోతే ఎవరిది భాద్యత అని వారు వాపోతున్నారు. మూగజీవులకు సరైన చికిత్సలు అందడానికి ప్రత్యేకంగా వైద్యుని నియమించాలని, ఇందుకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని పశువులదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
పశువుల ఆస్పత్రిలో అటెండరే దిక్కు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES