Saturday, October 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాపై ఇజ్రాయిల్ దాడి

గాజాపై ఇజ్రాయిల్ దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ట్రంప్‌ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి హమాస్‌ సిద్ధంగా ఉందని.. బందీల విడుదలకు అంగీకరించిందిని.. గాజాలో దాడులు ఆపాలని.. అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్‌కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ట్రంప్ ఆదేశాల‌ను బేఖాత‌రు చేస్తూ ఇజ్రాయిల్ సైన్యాలు గాజా సిటీలో వైమానికి దాడుల‌కు తెగ‌బ‌డ్డాయి. ఈ దాడుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా.. దక్షిణ భాగంలోని ఖాన్‌ యూనిస్‌ వద్ద మరో ఇద్దరు చనిపోయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు.

2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ సరిహద్దులో హమాస్‌ సంస్థ జరిపిన మెరుపు దాడిలో 1,200 మంది మరణించారు. మరో 251 మంది బంధీలుగా తీసుకెళ్లారు. ఆ త‌ర్వాత ఇజ్రాయెల్‌ గాజాపై ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిపిన దాడుల్లో 66, 000 మందికి పైగా మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. విధ్వంసంతో పాటు గాజాను దిగ్భంధించి.. మానవతా సాయాన్ని అందకుండా ఇజ్రాయెల్‌ బలగాలు చేశాయి. విద్యుత్‌ కొరత, తిండి, నీరు లేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -