Saturday, October 4, 2025
E-PAPER
Homeకరీంనగర్శ్రీనివాస్ మృతి బీఆర్ఎస్ కు తీరని లోటు

శ్రీనివాస్ మృతి బీఆర్ఎస్ కు తీరని లోటు

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి వార్డుకు చెందిన మాజీ గ్రామ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త వేములవాడ కమ్మరి శ్రీనివాస్(47) గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన ఆయన మరణం బిఆర్ఎస్ కార్యకర్తల్లో విషాదాన్ని నింపింది. శనివారం ఆయన పార్థివ దేహానికి బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యం నింపారు. ఈ సందర్భంగా నాయకులు మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, నీలం శేఖర్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, జోగిని శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -