నవనవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలో యాదవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శనివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. యాదవ కుల ఐక్యతను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆదివారం చెక్కపల్లి రోడ్‌లోని యాదవ సంఘం కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరగనుందని ప్రకటించారు. ఈ సమావేశానికి యాదవ సమాజానికి చెందిన ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున హాజరై సంఘ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
రాబోయే సమావేశంలో చేపట్టబోయే కార్యక్రమాలు, సంఘ అభివృద్ధి దిశగా తీసుకోబోయే నిర్ణయాలు, సభ్యత్వ నమోదు విధానం వంటి అంశాలపై విస్తృత చర్చ జరగనున్నట్లు తెలిపారు. సంఘ కార్యకలాపాలను ప్రతి గ్రామానికి విస్తరించేందుకు సభ్యులందరూ చురుకుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజ అభ్యున్నతే మా లక్ష్యం. కుల ఐక్యతతోనే సంఘం బలపడుతుంది అని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండ మల్లేశం, యెస తిరుపతి, వాసం మల్లేశం, నక్క కొమురయ్య, అంజయ్య, బత్తుల మహేందర్, నల్లవేణి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.