- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలో గల పాఠశాలకు అదే గ్రామానికి చెందిన నిగ్వ శ్రావణ్ రెడ్డి 20వేల రూపాయల విలువైన ఆల్ ఇన్ వన్ ప్రింటర్ ను శనివారం విరాళంగా అందజేశారు. పాఠశాల అభివృద్ధికి చేయూత అందించిన శ్రావణ్ రెడ్డిని ముధోల్ మండల విద్యాధికారి గోపిడి రమణారెడ్డి అభినందించారు. ప్రభుత్వ బడుల బలోపేతం కోసం యువకులు నిస్వార్థ సేవలు అందించడం కోసం ముందుకు రావడం అభినందనీయం అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునందా దేవి ,ఉన్నత పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు బిజ్జూరు సాయరెడ్డి ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -