– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న వారికే కాంగ్రెస్ పార్టీ టికెట్లు దక్కుతాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని శుక్రవారం దేవి గుడి వద్ద మండల నాయకుల, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కోసం ఒక్కో స్థానం నుండి ముగ్గురి పేర్లతో జాబితాను అధిష్టానంకు పంపుతున్నామన్నారు.
అందులో నుండి ఒకరికి అధిష్టానం టికెట్టు ఖరారు చేస్తుందన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా, టికెట్ రాని వారు నిరుత్సాహ పడవద్దని, టికెట్ వచ్చిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో టిపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సుంకేట బుచ్చన్న, జిల్లా అధికార ప్రతినిధి ఎలేటి గంగాధర్, జిల్లా కార్యదర్శి తక్కూరి దేవేందర్, జిల్లా కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్, నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, సుంకేట శ్రీనివాస్, కౌడ శైలేందర్, జైడి శ్రీనివాస్, డాక్టర్ మురళి, కొమ్ముల రవీందర్, రేవతి గంగాధర్, అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES