ఉపాధ్యాయ వృత్తి ఒక సామాజిక బాధ్యత
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
నవతెలంగాణ – డిండి
ప్రపంచంలో అన్ని వృత్తుల వారిని తయారు చేసే గురుతర బాధ్యత వృత్తి ఉపాధ్యాయ వృతి, ఉపాధ్యాయులు సొసైటీ మేకర్స్, ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు. ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్య మాత్రమే అని నెల్సన్ మండేలా అన్నారు. ఈ శక్తివంతమైన ఆయుధాన్ని ప్రజలకు అందించేవారు, మనిషిని పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దే క్రాంతి ప్రధాతలు ఉపాధ్యాయులు. సమాజంలో ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల తర్వాత గురువులకు విశిష్ట స్థానం ఉంది. మనదేశంలో సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5న జరుపుకుంటున్నారు.
ఉపాధ్యాయుల హక్కులు, బాధ్యతలు, విద్యా నియామకం, ఉపాధి బోధనా అంశాలకు సంబంధించి నిర్దేశించి ఉపాధ్యాయ ప్రమాణాలను 1966 సంవత్సరములు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఎడ్యుకేషన్ ఇంటర్నల్ సిఫార్సులను ఫారెస్ట్ లో ఆమోదించారు. దీన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం గా 1994 నుండి జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆర్థిక సాంఘిక సామాజిక స్థితిగతులు దేశాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అభివృద్ధి చెందిన దేశాలలో ఉపాధ్యాయులకు మెరుగైన జీతాలు సామాజిక గౌరవం లభిస్తుండగా పేద దేశాలలో వారు తక్కువ జీతాలు తక్కువ సాంఘిక గౌరవంతో పాటు సరియైన మౌలిక సదుపాయాలు లేకుండా పని చేయవలసి వస్తుంది. విద్య యొక్క ప్రాముఖ్యత ఉపాధ్యాయ వృత్తికి సమాజం ఇచ్చే విలువ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వనరులు సాంఘిక చట్టం వంటి అంశాలు ఉపాధ్యాయుల స్థితిగతులను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు
ఉపాధ్యాయ వృత్తికి ప్రాముఖ్యత ఇచ్చే దేశాలలో జపాన్ చైనా ముఖ్యమైనవి ఎందుకంటే ఈ దేశాలు ఉపాధ్యాయులను అత్యంత గౌరవప్రదమైన వృత్తులుగా చూస్తాయి. వారి శిక్షణ మరియు అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తాయి. జపాన్ లో కఠినమైన నియామక ప్రక్రియలు ఉన్నాయి. చైనా బలమైన ఉపాధ్యాయ అభివృద్ధి వ్యవస్థలను కలిగి ఉంది. సైన్స్ గణితం యోగా వంటి రంగాలలో భారతదేశం చేసిన కృషి ఉపాధ్యాయులకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది. అతి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో మనం కొనసాగుతున్నందుకు దానికి గర్వపడుతూ వృత్తికి సంపూర్ణ సార్ధకత దిశగా ప్రయాణించాలన్న వృత్తికి ఉన్నతిచ్చే విధంగా ఉపాధ్యాయుడిగా మనం నిరంతరం సామాజిక స్పృహతో తరగతి గది లోపల, బయట విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ సమాజంలో గల సమస్యలపై ప్రతి సందర్భంలో ఎడ్యుకేట్ చేయవలసిన గురుతర బాధ్యత ఉపాధ్యాయ వృత్తి లో కొనసాగుతున్న వారిపై ఉన్నది.
ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు, రుగ్మతలు అంటరానితనం, కులవివక్షత, సాంఘిక సామాజిక ,ఆర్థిక అంతరాలు ,లింగ వివక్షత, మూఢనమ్మకాలు, మతోన్మాదం, వంటి రుగ్మతలపై హేతువాద దృష్టితో పిల్లలను ఆలోచింపజేస్తూ కులం కన్నా మతం కన్నా మానవత్వంతో కూడిన సమాజం ఒక గొప్ప మానవతా విలువలతో కూడుకున్న అభివృద్ధి చెందుతున్న సమాజంగా భావించవచ్చు.
ఆ దిశగా గుర్తెరిగి విద్యార్థులను తీర్చిదిద్ద వలసిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నది. అంతిమంగా ఉపాధ్యాయ వృత్తికి ఉన్న ప్రాముఖ్యత అనేది ఆ దేశాల సంస్కృతి విద్యపై ప్రజల అభిప్రాయాలు మరియు ప్రభుత్వం ఇచ్చే మద్దతు పై ఆధారపడి ఉంటుంది. వెలుగుతున్న కొవ్వొత్తి మరికొన్ని కొవ్వొత్తులను వెలిగించగలదు. అనే నినాదంతోనే గురువు ఒక నిత్య విద్యార్థిగా ఉంటూ తరగతి గది లోపల, బయట విద్యార్థులను నిరంతరం సందర్భం, సమయస్ఫూర్తితో జీవితంలో నేర్చుకున్న అన్ని అంశాలు సమాజ అభివృద్ధికి వ్యక్తిగత వ్యక్తిత్వానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం నిజమైన వృత్తి బోధన. నియమాలతో సమాజంలో గల సామాజిక అసమానతలపై నిరంతరం అవగాహన ఆకలింపు చేసుకొని సమాజంలో అతి విలువైన వెలకట్టలేని మానవ వనరులను నిరంతరం చైతన్య పరచడమే నిజమైన బోధన వృత్తి .