అన్న దానంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ 5వ వార్షికోత్సవ ఉత్సవాలు శనివారం నుండి ఉల్లాసంగా ప్రారంభమ య్యాయి. ప్రారంభ రోజు అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ పాల్గొని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించారు. ఉత్సవాలకు సంబంధించిన వివరాలను శ్రీ రేణుక ఎల్లమ్మ అలయ కమిటీ చైర్మన్ దశ గౌడ్ వివరించారు.శనివారం అన్నదానం ఆదివారం పోచమ్మ బోనాలు, సోమవారం పుట్టకు ధనిపోయుట, మంగళవారం బోనాలు ముగింపు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ప్రతి ఏటా ఉత్సవాల సందర్భంగా గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాది వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవాలు పాల్గొని విజయవంతం చేస్తారని ప్రత్యేక లాగానే ఈసారి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అంతకుముందు రాంపూర్ డి గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ కు పూలమాల శాలువాలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుక ఎల్లమ్మ అలయ కమిటీ సభ్యులు రమేష్ గౌడ్, రామా గౌడ్, నరేష్ గౌడ్, స్వామి గౌడ్, కిషన్ గౌడ్, నవీన్ గౌడ్, భాస్కర్ గౌడ్, మహేష్ గౌడ్ ,నడిపి నర్స గౌడ్, భోజ గౌడ్, తో పాటు తిర్మన్ పల్లి మాజీ సర్పంచ్ ఏ గంగాగౌడ్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నల్లవెల్లి సాకలి సాయిలు,కుమ్మరి గంగాధర్ తోపాటు తదితరులు ఉన్నారు.
రాంపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు ప్రారంభం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES