మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ – పెద్దవంగర
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి అయన సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలన్నారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఏడాదైనా గంట్లకుంట బీటీ రోడ్డు పనులు పూర్తి కాలేదన్నారు. కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాలకుర్తి యాదగిరి రావు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, సమ్మయ్య, సుధీర్, సుధాకర్, భాస్కర్ కాసాని హరీష్, శ్రీనివాస్, కుమార్, బిక్షపతి, నారాయణ, యాకయ్య, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES