Saturday, October 4, 2025
E-PAPER
Homeక్రైమ్చెక్ డ్యామ్ వద్ద డెడ్ బాడీ లభ్యం

చెక్ డ్యామ్ వద్ద డెడ్ బాడీ లభ్యం

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద గల్లంతైన మచ్చంటి శేఖర్ (32) డెడ్ బాడీ పోచారం ప్రధాన కాలువ లో నిర్మించిన చెక్ డ్యామ్ వద్ద లభించింది. గత రెండు రోజులుగా ప్రాజెక్టు వద్ద చేపలు పట్టడానికి వచ్చి మచ్చంటి శేఖర్ నీటిలో మునిగిన విషయం విధితమే. గత రెండు రోజులుగా పోలీస్ సిబ్బంది ఫైర్ సిబ్బంది ప్రాజెక్టు ప్రధాన కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా శనివారం రోజు ఉదయం డెడ్ బాడీ చెక్ డ్యామ్ వద్ద లభించింది. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -