- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ నాళా ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో ఏఈ అశ్విని మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా కెపాసిటీ 1.237 క్యూసెక్కులు ఉందని అన్నారు. ప్రస్తుతము శనివారం ఉదయం ఆరు గంటల నాటికి 838 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వచ్చి చేరిందని తెలిపారు. ఒక వరద గేటు ద్వారా 568 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
- Advertisement -