వెంకట్ రెడ్డి పార్టీవదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-పాలకుర్తి
మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మృతి చెందడంతో శనివారం తుంగతుర్తి లో గల ఆయన నివాసంలో దామోదర్ రెడ్డి పార్వతీవదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని తెలిపారు. దామోదర్ రెడ్డి మృతిని తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు జీర్ణించుకోవడంలేదని అన్నారు. ప్రజల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకుడని తెలిపారు. దామోదర్ రెడ్డికి పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు నివాళులు అర్పించారు.
దామోదర్ రెడ్డి మృతి.. కాంగ్రెస్ కు తీరనిలోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES