నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని పలు గ్రామంలో శనివారం సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలు తీసి చప్పట్లు, కోలాలు, డీజే చప్పుళ్ల పాటల మధ్య కనువిందు చేసే నృత్యాలు చేస్తూ చూసే వారిని ఆకట్టుకున్నారు. అత్తవారి ఇండ్లలో నుండి పుట్టింటికి వచ్చి ఎంతో ఇష్టంగా ఆడే బతుకమ్మ ఆడవాళ్ళ పెద్ద పండుగగా భావించే ఆడ బిడ్డలు, పుట్టింటి ఆడపడుచులు గ్రామానికి వచ్చి బతుకమ్మ పండుగలో పాల్గొన్నారు. ప్రకృతిలో లభించే తీరొక్క పూలను పేర్చి అలంకరించి పసుపు గౌరమ్మను మధ్యలో నిలిపి కొలిచే ఈ సంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతం.మల్లచ్చే ఏటి వరకు చల్లగా పోయి రా అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మలను నీటిలోకి సాగనంపారు. అనంతరం వెంట తెచ్చిన సద్దుల ప్రసాదాలు పంచుకొని తింటూ బతుకమ్మ సంబరాలను ముగించారు.
ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES