Saturday, October 4, 2025
E-PAPER
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు దుర్మరణం

- Advertisement -

-వరికోత యంత్రం విడిభాగంతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టిన డీసీఎం
– సీతాఫలం కొనుగోలు చేస్తున్న తల్లికూతురు దుర్మరణం
– తండ్రి, కూతురికి తీవ్ర గాయాలు..
– ఘటన స్థలాన్ని సందర్శించిన ఏసీపీ రవీందర్ రెడ్డి
నవతెలంగాణ – బెజ్జంకి

మద్యం మత్తులో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ప్రమాదం చోటు చేసుకుని తల్లికూతురు దుర్మరణం చెందారు. తండ్రి కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని దేవక్కపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన రామోజు శ్రీమన్ తన అత్తవారి గ్రామం కొహెడ మండలం వింజపల్లి. దసర పండుగకు పుట్టింటికి వచ్చిన భార్య వీణారాణి, కూతుర్లు మనస్విని, యసస్వినితో కలిసి శ్రీమన్ తమ స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

దేవక్కపల్లి గ్రామ శివారులో రాజీవ్ రహదారి ప్రక్కన విక్రయిస్తున్న సీతాఫలాలను కొనుగోలు చేయడానికి ద్విచక్ర వాహనం నిలిపారు. కరీంనగర్ వైపు వరికోత యంత్రం విడిభాగంతో వెళ్తున్న ట్రాక్టరును డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో వరికోత యంత్రం విడిభాగం సీతాఫలాలు కొనుగోలు చేస్తున్న వారికి తగలడంతో తల్లికూతురు వీణారాణి(39), మనస్విని అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి కూతురు శ్రీమన్, యసస్విని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు టోల్ గేట్ అంబులెన్స్ యందు గాయడడిన వారిని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సౌజన్య తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని ఘటనపై వివరాలు నమోదు చేశారు. మృతురాలు అన్న తూమోజు జగదీశ్వర చారి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టామని ఎస్ఐ సౌజన్య తెలిపారు.

డీసీఎం డ్రైవర్ వల్లే ప్రమాదం:ఏసీపీ రవీందర్ రెడ్డి
దేవక్కపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై చోటుచేసుకున్న ప్రమాద ఘటన స్థలాన్ని ఏసీపీ రవీందర్ రెడ్డి ట్రాఫిక్ ఏసీపీ సుమన్ తో కలిసి సందర్శించి పరిశీలించారు. డీసీఎం వాహన డ్రైవర్ అయూబ్ ఖాన్ మద్యం మత్తులో ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ఏసీపీ రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రమాదంపై చట్టపరమైన చర్యలు చేపడుతామని ఏసీపీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -