నవతెలంగాణ – మిరుదొడ్డి
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించింది గ్రామీణ పేద విద్యార్థిని. డాక్టర్ కావాలనే లక్ష్యంతో చదువుతూ మెడిసిన్ సీటును కైవసం చేసుకుంది. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సుంకరి కొండల్- బాలమణి దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కూతుర్లపై చిన్న చూపు చూడకుండా మగవారికి దీటుగా తల్లిదండ్రులు చదివించారు. పేద కుటుంబానికి చెందినప్పటికీ కూతుర్లను చదివించడంలో వివక్ష చూపకుండా చదువుకోడానికి ప్రోత్సహించారు. పెద్ద కూతురు సౌమ్య ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో 4158 ర్యాంక్ సాధించి వరంగల్లో ఎంబిబిఎస్ సీటును కైవసం చేసుకుంది. తండ్రి కొండల్ ఆర్టీసీలో డ్రైవర్ గా , తల్లి బాలమణి ఇంటి దగ్గరే బీడీ కార్మికురాలుగా పనిచేస్తున్నప్పటికీ, పేదరికం అడ్డు కాదని సౌమ్య పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ సీటును సాధించడం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదరికాన్ని సైతం జయించే శక్తి చదువుకు మాత్రమే ఉందని, ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదవాలని విద్యార్థిని సౌమ్య అన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుకూలంగా ఉన్నత చదువులు చదువుకొని డాక్టర్ అవుతానని ధీమా వ్యక్తం చేశారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంబిబిఎస్ సీటు సాధించిన సౌమ్యను గ్రామస్తులు అభినందించారు.
వివక్ష లేదు.. లక్ష్యం వైపు కూతురు అడుగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES