Sunday, May 11, 2025
Homeకరీంనగర్కార్మికులకు కూలీ పెంచాలి..

కార్మికులకు కూలీ పెంచాలి..

- Advertisement -

సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ
నేతన్న విగ్రహానికి వినతి పత్రం
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్
: ప్రభుత్వ ఉత్పత్తి చేయిస్తున్న మహిళా సంఘాల చీరలకు సంబంధించి వార్పిన్ కార్మికులకు కూలీ పెంచి నిర్ణయించాలాని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయు ఆధ్వర్యంలో చేపట్టిన వార్పిన్ కార్మికుల సమ్మె 6 రోజుకి చేరింది. సమ్మె లో భాగంగా కార్మికులు సిఐటియు కార్యాలయం నుండి సిరిసిల్ల పాత బస్టాండ్ లోని నేతన్న చౌక్ వరకు బైక్ ర్యాలీ చేపట్టి నిరసన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం మాట్లాడుతూ ప్రభుత్వ చీరలకు మీటర్ వస్త్రానికి రెండు రూపాయలు పెంచినా కూడా యజమానులు కార్మికులకు కూలి పెంచకుండా నిర్లక్ష్య దొరిణి వహిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులతోని వెంటనే చర్చలు జరిపించి వార్పిన్ , కార్మికులకు పనికి తగిన విధంగా కూలి నిర్ణయించలన్నారు. లేని యెడల సమస్య పరిష్కరించే వరకు పోరాడుతామని హెచ్చరించారు. అనంతరం నేతన్న విగ్రహనికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ వార్పిన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఉడుత రవి , యూనియన్ నాయకులు మచ్చ వేణు , బూట్ల వెంకటేశ్వర్లు , ఐరేని ప్రవీణ్ , సామల నర్సయ్య , శ్రీకాంత్ , రమేష్ , మధు , శంకర్ , సదానందం , దేవయ్య , రవి, శ్రీనివాస్ , రాజు , శేఖర్ , సతీష్ , నర్సయ్య , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -