Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ బెటాలియన్ లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

పోలీస్ బెటాలియన్ లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ -డిచ్ పల్లి
మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో  బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ దంపతులు, అడిషనల్ కమాండెంట్ సాంబశివరావు దంపతులు ప్రత్యేక పూజలు యాగము నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శనివారము ఆరాధన ఉదయం గరుడ ప్రతిష్ఠ, శాలా ప్రవేశము, హోమ కుంభ స్థాపన, వాస్తు స్థాపన, అగ్ని ప్రతిష్ట, అంకురారోపణ హెూమం, వాస్తు హోమం, గరుడ తత్వ హోమం, ప్రాణ ప్రతిష్ట హోమము, ధ్వజారోహణము.

సాయంత్రం: భేరిపూజ, దేవతా అహ్వానము, నిత్వహవనము, బలి హరణము, రాత్రి 07.00 గం.లకు హనుమంత వాహన సేవా మరియు హారతి మంత్ర వుష్టము, తీర్థవ్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -