Sunday, October 5, 2025
E-PAPER
Homeమానవిమంచి ఆలోచనలతో…

మంచి ఆలోచనలతో…

- Advertisement -

పియ్రమైన వేణు గీతికకు
నీ దగ్గరకు ఎంత సంతోషంగా వచ్చానో.. పండక్కి నీకు ఇష్టమైనవి చేసిపెట్టాలని ఎంతగా అనుకున్నానో.. అంతా నిరాశే అయింది. ఆరోగ్యం సహకరించక ఏమీ చేయలేకపోయాను చిట్టి తల్లీ. సరే.. కిందటి ఉత్తరంలో ప్రతికూల ఆలోచనలు.. అదే నెగటివ్‌ థింకింగ్‌ గురించి చెప్పాను కదా! ఈ ఉత్తరంలో మంచి ఆలోచనల గురించి అదే పాజిటివ్‌ థింకింగ్‌ గురించి చెప్తాను. మంచి ఆలోచనలతో మనసు, ఆరోగ్యం ఎంత బాగుంటాయో మాటల్లో చెప్పలేను. ఎవరి గురించైనా మంచిగా ఆలోచించావనుకో వారి పట్ల గౌరవం, అభిమానం పెరుగుతాయి. ఎవరైనా తమ కష్టాలు, ఇబ్బందులు నీతో పంచుకున్నప్పుడు మంచి మాటలతో వారికి ధైర్యం చెబితే నిరాశ పోయి కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొనే మానసిక స్థైర్యం వస్తుంది.

మన వల్ల ఎవరికైనా మంచి జరిగితే వారిలోని సంతోషాన్ని మనం చూస్తాము. కాబట్టి అది కూడా మన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మనుషులతో అనుబంధాలు పెరగాలి అంటే మంచి ఆలోచనలు పంచుకోవాలి. ప్రకృతి ఎంతో అత్భుతంగా ఉంటుంది. దాన్ని ప్రేమిస్తూ, ఆస్వాదిస్తూ ఉండటం వల్ల మనసూ, ఆరోగ్యం రెండు బాగుంటాయి. మనసుపై ప్రకృతి ప్రభావం చాలా ఉంటుంది. కొందరికి జంతువులంటే ఇష్టం. వాటిని ప్రేమించే వారిలో కూడా మంచి ఆలోచనలే ఉంటాయి.

మంచి ఆలోచనలు ఉన్నవారితో స్నేహం, బంధుత్వం రెండు కూడా ప్రతికూల ఆలోచనలు రానివ్వవు, ఒక వేళ వచ్చినా వాటిని పారద్రోలుతాయి. ఎప్పుడూ మంచి ఆలోచనలతో స్నేహ బాంధవ్యాలు పెంచుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకో చిట్టి తల్లి. ఇప్పటి వరకు నీలో మంచి ఆలోచనలను, మంచి కోరుకోవడం, అపకారికి కూడా ఉపకారం చేయడం మాత్రమే చూసాను. దీన్ని ఇలాగే ముందుకు సాగిస్తావని, నేను చెప్పిన ఈ విషయాలను గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో కూడా అందరికి మంచి చేస్తావని ఆకాంక్షిస్తూ..

ప్రేమతో మీ అమ్మ
పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -