సమాన పనికి సమాన వేతనం అందించాలి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
శ్రామిక మహిళల శ్రమను గౌరవించాలని సమాన పనికి సమాన వేతనం అందించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ సూరం పద్మ అన్నారు. బి. వై. నగర్ లోని కార్మిక భవన్ లో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ సూరం పద్మ లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలతో పాటు శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆర్థిక , సామాజిక అణచివేత , పని భద్రత , వేతనాలు లేని శ్రమ తదితర సమస్యలపై సిఐటియు శ్రామిక మహిళ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాడుతుందని అన్నారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న నయా ఉదారవాద విధానాలు కార్పొరేట్ – మతోన్మాదుల ప్రయోజనాల కోసం దోహదపడుతున్నాయని ఈ విధానాల వలన మహిళలు మరింత హీన స్థితికి దిగజారిపోతున్నారని మహిళల శ్రమను గౌరవించకపోవడం , గౌరవ శ్రమకు తగిన గౌరవప్రదమైన వేతనాలు నిర్ణయించకపోవడం , లైంగిక వేధింపులపై తగిన చర్యలు తీసుకోకపోవడం వలన శ్రామిక మహిళలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు.
శ్రామిక మహిళల సమస్యలను పరిష్కరించుకోవడం వారి హక్కులను కాపాడుకోవడం కోసం భవిష్యత్తు ఉద్యమ పోరాట కార్యక్రమం రూపొందించుకోవడం కోసం శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర సదస్సు అక్టోబర్ 5 , 6 తేదీలలో రెండు రోజులపాటు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని ఇ సదస్సుకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మహిళా సమన్వయ కమిటీ నాయకులు పాల్గొనడం జరుగుతుందని సదస్సు జయప్రదానికి జిల్లాలోని శ్రామిక మహిళలందరూ సహకరించాలని కోరారు
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , సందుపట్ల పోచమల్లు , లలిత , ఇందిరా , ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.
శ్రామిక మహిళల శ్రమను గౌరవించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES