నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలిసెట్ ఉచిత శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ముగింపు సమావేశంలో పోపా సభ్యులు మాట్లాడారు. పోపా అందించిన ఉచిత పాలిసెట్ శిక్షణ పొందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. వేసవి సెలవుల్లో విద్యా దానానికి తమ సమయాన్ని కేటాయించిన ఫ్యాకల్టీలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పోపా ఉపాధ్యక్షులు మామిడాల భూపతి, గెంట్యాల భూమేష్, ఎంఈవో దూస రఘుపతి, రాష్ట్ర టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గాజుల ప్రతాప్,దాసరి నాగేశ్వర్, బైరి రవీందర్, శ్రీపతి శ్రీనివాస్, కృష్ణ సాయి, బండారి శ్రీనివాస్ ఆంజనేయులు, మచ్చ ఆనంద్, ఆంకారపు జ్ఞానోభా, కోడం శ్రీనివాస్, మోర దామోదర్, కారంపూరీ రాజేశం, కోడం రాంప్రసాద్, చేరాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన పాలిసెట్ ఉచిత శిక్షణ తరగతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES