Sunday, October 5, 2025
E-PAPER
Homeసినిమాసీట్‌ ఎడ్జ్‌ థ్ల్రిలర్‌

సీట్‌ ఎడ్జ్‌ థ్ల్రిలర్‌

- Advertisement -

‘నాటకం’, ‘తీస్‌ మార్‌ ఖాన్‌’ వంటి డిఫరెంట్‌ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్‌ జీ గోగణ మంచి పేరు సంపాదించుకున్నారు. దసరా సందర్భంగా ఆయన తదుపరి చిత్రం ‘మారియో’ నుంచి అప్డేట్‌ ఇచ్చారు. అద్భుతమైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో అందరినీ అలరించారు. ఈ పోస్టర్‌ ‘ఎ టర్బో-చార్జ్డ్‌ ర్యాంప్‌ రైడ్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. యాక్షన్‌-ప్యాక్డ్‌, స్టైలిష్‌, రొమాంటిక్‌ వైబ్‌తో ఈ పోస్టర్‌ వైరల్‌ అయ్యింది. ఫస్ట్‌లుక్‌లో హీరో అనిరుధ్‌, హెబ్బా పటేల్‌ మధ్య ఉన్న కెమిస్ట్రీ అర్థం అవుతుంది. అనిరుధ్‌ రైఫిల్‌ పట్టుకుని ఉన్న తీరు, ఇంటెన్స్‌ లుక్‌ చూస్తుంటే హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీన్స్‌ ఉండేలా కనిపిస్తున్నాయి. హెబ్బా పటేల ఎరుపు రంగు దుస్తుల్లో డైనమిక్‌గా కనిపిస్తున్నారు.

క్లాసిక్‌ కారు, చీకటి, వర్షం ఇలా అన్నింటినీ చూస్తుంటే థ్రిల్లర్‌ థీమ్‌ను సూచిస్తుంది. సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్‌ కలిగించేలా అన్ని రకాల కమర్షియల్‌ అంశాలను తగినంత వినోదంతో మిళితం చేసే చిత్రాన్ని అందించనున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పూర్తి స్థాయి నిర్మాణంలో ఉంది. రాకేందు మౌళి, మౌర్య సిద్ధవరం, యష్నా ముతు లూరి, కల్పిక గణేష్‌, మదీ మన్నెపల్లి, లతా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం, పాటలు : రాకేందు మౌళి, సంగీతం: సాయి కార్తీక్‌, రాకేందు మౌళి, సినిమాటోగ్రాఫర్‌: ఎంఎన్‌ రెడ్డి, ఎడిటర్‌: మణికాంత్‌, మదీ మన్నెపల్లి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -