– ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్గొండ జిల్లాకేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మిర్యాలగూడ పట్టణంలో విద్యార్థులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యురాలు ప్రసన్న మాట్లాడారు.ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న శివాని, మనిషా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు.ఇన్‌స్టాగ్రాంలో అశ్లీలకరమైన ఫొటోలను మార్ఫింగ్ చేసి 15 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేసిన వారిపై సమగ్ర విచారణ చేపట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ కేంద్రాలకు ఉన్నత చదువుల కోసం వచ్చి బాగా చదువుకొని తన కూతుళ్లు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్న తల్లిదండ్రులకు శవాల రూపంలో ఇంటికి వెళ్లడం దుర్మార్గపాలనకు నిదర్శనమన్నారు.విద్యార్థినులకు, మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని పోలీసు షీ టీమ్‌లు ఏర్పాటు చేస్తే ప్రచారంలో పుల్… రక్షణ నిల్ అన్నట్టుగా ఉందన్నారు. జిల్లాలో ఉన్న బాలికల విద్యాసంస్థల చుట్టూ పోలీసు వారి పెట్రోలింగ్ పెంచాలని కోరారు. సమాజంలో విద్యార్థినుల, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై దాడులపై సెమినార్ రూపంలో విద్యార్థులను చైతన్య పరచడంలో షీటీమ్‌లు సరైన పాత్ర పోషించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర సైదా నాయక్, డివిజన్ కార్యదర్శి జగన్ నాయక్, దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న, టౌన్ అధ్యక్ష కార్యదర్శులు నుమాన్, వినరు, మండల కార్యదర్శి వంశీ, నాయకులు తరుణ్, సమీర్, రవి, ఆనంద్, ప్రసాద్, కష్ణ తదితరులు పాల్గొన్నారు.
నల్గొండకలెక్టరేట్: భారత విద్యార్థి ఫెడరేషన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ క్లాక్ టవర్ సెంటర్లో ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో నిరసన ర్యాలీనిర్వహించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శిరాలు లక్ష్మీ దుర్గ మాట్లాడుతూ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న శివాని, మనిషా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. ఇంస్టాగ్రామ్ లో అశ్లీల కరమైన ఫోటోలు మార్ఫింగ్ చేసి 15 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బ్లాక్మెయిలింగ్ చేసిన వారిపై సమగ్ర విచారణ చేపట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, యశ్వంత్, నిశ్వంత్, ప్రశాంత్, గణేష్, కళ్యాణి, స్వప్న, కావ్య, అంజలి, దేవి, కవిత, సంధ్య, నీరజ, తదితరులు పాల్గొన్నారు.