నవతెలంగాణ-బయ్యారం
మండల పరిధిలోని కొ త్తపేట-గంధంపల్లి గ్రామం లో తన తండ్రి జ్ఞాపకార్థం ప్రముఖ వ్యాపారవేత్త వెనిగ ళ్ళ ఆనంద ప్రసాద్ నూత నంగా ఏర్పాటు చేసిన వెనిగళ్ళ జగ్గయ్య ప్రజా కళ్యాణ వేదిక ప్రారంభోత్సవ కార్యక్ర మం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ మాలో త్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ తాను పుట్టిన ఊరు రు ణం తీర్చుకోవడానికి, తండ్రి జ్ఞాపకార్థం ప్రజాకళ్యాణ వేదిక ఏర్పాటు చేయడం ఎం తో సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో వెనిగళ్ళ ఆనంద ప్రసాద్, కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు, సత్తుపల్లి కోఆర్డినేటర్ వడ్లమూడి సురేష్, బీఆర్‌ఎస్ నాయకులు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, ముత్యం వెంకన్న గౌడ్, జెడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా, బీ ఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ తాతా గణేష్, సొసైటీ చైర్మన్ మూల మ ధుకర్ రెడ్డి,భూక్య ప్రవీణ్ నాయక్ పాల్గొన్నారు. కొత్తపేటలోని పురాతన ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా ఆధునీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.