నవతెలంగాణ-దేవరకొండ
ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ సంక్షేమ హాస్టల్ ఇద్దరు విద్యార్థినీలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగా వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఎస్ఎఫ్ఐ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ మధ్యకాలంలోనే సామాజిక మద్యం లోను వారి ఫోటోలను అశ్లీలంగా చిత్రీకరణ చేసి పెట్టడంతో విద్యార్థులకు మనోవేదనకు లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. దోషులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు రామావత్ లక్ష్మణ్,కుర్ర రాహుల్,కాట్రావత్ దేవేందర్, గౌతమ్, నరేందర్, మనోజ్, వేణు, శంకర్, ఆంజనేయులు,ఉదేరు, ప్రకాష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. దామరచర్ల: నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలో ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో విద్యార్థులు ర్యాలీతో పాటు జాతీయ రహదారిపై అనంతరం రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల కార్యదర్శి వీరన్ననాయక్,అశోక్ మనోహర్ ,శీను ,చంటి, మహేష్ మల్లేశ్వరి , శ్రీహర్షిని శిరీష, మాధవి, అనిత, ఉమా తదితరులు పాల్గొన్నారు