Sunday, October 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమీరు.. మహాత్ములయ్యా!

మీరు.. మహాత్ములయ్యా!

- Advertisement -

డబ్బు ఏమైనా చేస్తుంది, ఏదైనా చేయిస్తుంది అన్న సంగతి తెలిసిన విషయమే. కానీ, స్వయంగా గాంధీ జయంతి, దసరా ఒకే రోజు రావడంతో డబ్బు తన పని తాను చేసుకుపోయింది. ఈ సందర్భంగా సుక్క..ముక్కను సర్కారు బంద్‌ పెట్టింది. ఈ రెండు లేనిదే పండుగ మజా రాదాయే. వ్యాపారులకేమో లాభమే అంతిమ లక్ష్యమాయే! కాబట్టి పండుగకు ముందురోజే కావాల్సిన మందును మార్కెట్లోకి తీసుకొచ్చారు. అవసరానికి మించి కొన్నారు. ఎంత అడిగితే అంత మందును బ్లాక్‌లో జనానికి అమ్మారు. ఎంఆర్‌పీ ధరకంటే ఎక్కువగా వసూలు చేశారు. మాంసం కంటే కూడా మందు గురించే టెన్షన్‌. ఇది లేకుంటే చుట్టాలకు మర్యాదే ఉండదట. ఈ క్లిష్ట సమయంలో తాగేవారు జేబులు గుల్ల చేసుకుంటే, వ్యాపారులకు దసరా కన్నుల పండుగైంది. ‘పండుగకు మందు తెచ్చారా?’ అంటే ఏమీ ఎరగనట్టూ పైకి మాత్రం ‘అయ్యో గాంధీ జయంతి కదా! మా ఇంట్లో తాగం…తినం’ అంటూ నట సార్వభౌములు చెబుతున్న మాటలివి.

మటన్‌ దుకాణాలు బందు, కానీ ఇండ్లలో పొటేల్‌ కొసుకుంటే తప్పేమీ లేదట. చికన్‌షాపుల తెరవరు, కానీ కోడిని ఇంటికి తీసుకెళ్లి కోసు కుంటే ఎవరికి ఇబ్బంది లేదట. ఇదేం లాజికో? ఎవరైనా దుకాణం తెరిచారంటే అంతే సంగతి. ఫైన్‌ అయినా కట్టాలి, లేదంటే లంచమైనా ఇవ్వాలి. ఈసారి దసరాకు అధికారుల కాసుల పంట పండింది. ఇక్కడ చెప్పదల్చుకున్నది ఏంటంటే వ్యాపారులకు అక్టోబర్‌ 2న గాంధీ పుట్టిన రోజు అన్న సోయి లేదు. వినియోగదారులూ మరచిపోయారు. కానీ, గాంధీ జయంతిని వ్యాపారంగా మార్చేసిన ‘మహాత్ములు’ కనిపించారు. సుక్క..ముక్క లేని జీవితమే వ్యర్థమన్నట్టు మూడు రోజుల్లో జస్ట్‌ రూ.697 కోట్ల మందు తాగారంటే మీరు..మహాత్ములయ్యా..!

గుడిగ రఘు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -