Sunday, October 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిద్రోహ చరితకు జేజేలా?

ద్రోహ చరితకు జేజేలా?

- Advertisement -

దేశ స్వాతంత్య్ర పోరాటంలో అసలు పాత్రేలేని ఆరెస్సెస్‌ వందేండ్ల సందర్భంగా వంద రూపాయల నాణాన్ని, తపాలా బిళ్లను ప్రభుత్వం విడుదల చేయటం సిగ్గు చేటయిన విషయం. ఎందుకంటే జాతీయోద్యమంలో పాల్గొనకపోగా బ్రిటిష్‌ వారికి అనుకూలంగా పనిచేస్తూ, స్వతంత్ర పోరాట స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రజలను విభజించేందుకు ప్రయత్నించిన ఆరెస్సెస్‌ జాతి జనులకు స్మరణీయమా? ”క్షమాబిక్ష పెడితే బ్రిటీష్‌ ప్రభుత్వానికి విశ్వాసంగా ఉంటాను. దేశంలోని యువతను స్వాతంత్య్రోద్యమంవైపు వెళ్లకుండా చూస్తాను” అని వీరి వీడీ సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి క్షమాభిక్ష కోసం విజ్ఞాపన చేసుకోవటం అనేది చరిత్ర చెబుతున్న సత్యం.భారత రాజ్యాంగాన్ని, జాతీయ జెండానూ ఎప్పుడూ గౌరవించని వారికి ప్రభుత్వ స్మృతి చిహ్నాల అభినందనా! ఎంత ఘోరం!

‘ఇంత వయసొచ్చింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు’ అని పెద్దలు మన ఇండ్లళ్లో సరిగా ప్రవర్తించని, మాట్లాడని వాళ్లను అంటుంటారు. పుట్టిన ప్రతి ప్రాణికీ ఏండ్లు గడుస్తాయి. వయసు పెరుగుతుంది. అదేమంత విషయం కాదు. పెరిగిన వయసుతో ఎంత పరిణితి సాధించావు అన్నదే ముఖ్యవిషయం. వందేండ్లు బతకటం ఒక గుర్తించదగిన అంశమే. కానీ ఆ వందేండ్లలో ఏమి చేశావు? ఏం సాధించావు? అనేదే చరిత్ర. అందరమూ గుర్తుంచుకోవాల్సిన చరిత్ర అవుతుంది. మానవాళికి మేలు జరిగే పనిచేసినపుడే తరతరాలు తలపోస్తారు. గుర్తుంచుకుంటారు. సమాజానికి కీడు చేసినవారినీ, మానవ హననానికి పాల్పడిన వారినీ కూడా చరిత్ర దోషిగా నిలబెట్టి చాటి చెబుతూనే ఉంటది.

ఇపుడు ఏ ఘనచరిత్రా లేనివారు, చరిత్రలో దోషులుగా నిలబడ్డవారు, తమకు తాము గొప్పతనాన్ని ఆపాదించుకుని, ఒక అబద్దపు చరిత్రను నిస్సిగ్గుగా ప్రచారం చేసుకోవటం చూస్తున్నాము. సాక్షాత్తు దేశ ప్రధాని ఆరెస్సెస్‌ వందేండ్ల ఉత్సవం సందర్భంగా అసత్య చరిత్రను వల్లించే ప్రయత్నం చేశారు. దేశ ప్రజలను ఐక్యపరచే ప్రయత్నం స్వయమ్‌ సేవక్‌ సంఫ్‌ు చేసిందనీ చెబుతూ, హైదరాబాద్‌ సంస్థానంలో రజాకార్లపై సంఫ్‌ు వీరోచితంగా పోరాటం చేసిందనీ నమ్మబలికారు. నేటి కొత్తతరానికి అబద్దపు చరిత్రను వినిపించారు. ఈ దేశంలో సంస్థానాలు సొంత దేశాలుగానే కొనసాగాలని నాటి ఆరెస్సెస్‌ కోరుకున్నది. ఇక నిజాం నిరంకుశత్వంపై పోరాటంలో ఎక్కడా పాల్గొనలేదు. రజాకార్‌కు, నాటి జమీందారులకు, జాగీర్‌దారులకు వ్యతిరేకంగా పోరాడిన ఒక్క వీరున్ని చూపగలరా వీళ్లు? ఎంతమంది ప్రాణాలొడ్డి పోరాటం చేశారో కొన్ని పేర్లయినా ప్రకటించండి. ఇక్కడ పోరాటం చేసిందీ, ప్రాణాలను త్యాగం చేసిందీ కమ్యూనిస్టులు. ఆ వీరుల త్యాగధనుల పేర్లు చరిత్ర పొడుగునా లిఖించబడి ఉన్నాయి. దాన్ని ఎవరూ కప్పిపెట్టలేరు.

ఉన్నత పదవిలో ఉండి కూడా, ఇంత దిగజారి అబద్దాలు మాట్లాడటం చాలా విచారకరం. ఇక దేశ స్వాతంత్య్ర పోరాటంలో అసలు పాత్రేలేని ఆరెస్సెస్‌ వందేండ్ల సందర్భంగా వంద రూపాయల నాణాన్ని, తపాలా బిళ్లను ప్రభుత్వం విడుదల చేయటం సిగ్గు చేటయిన విషయం. ఎందుకంటే జాతీయోద్యమంలో పాల్గొనకపోగా బ్రిటిష్‌వారికి అనుకూలంగా పనిచేస్తూ, స్వతంత్ర పోరాట స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రజలను విభజించేందుకు ప్రయత్నించిన ఆరెస్సెస్‌ జాతి జనులకు స్మరణీయమా? ”క్షమాబిక్ష పెడితే బ్రిటీష్‌ ప్రభుత్వానికి విశ్వాసంగా ఉంటాను. దేశంలోని యువతను స్వాతంత్య్రోద్యమంవైపు వెళ్లకుండా చూస్తాను” అని వీరి వీడీ సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి క్షమాభిక్ష కోసం విజ్ఞాపన చేసుకోవటం అనేది చరిత్ర చెబుతున్న సత్యం.భారత రాజ్యాంగాన్ని, జాతీయ జెండానూ ఎప్పుడూ గౌరవించని వారికి ప్రభుత్వ స్మృతిచిహ్నాల అభినందనా! ఎంత ఘోరం! ”ఆరెస్సెస్‌ సంస్థ వంద ఏండ్లు పూర్తి చేసుకుంది. దేశం కోసం పనిచేసింది అని ప్రచారం చేస్తున్నారు కదా! ఆ సంస్థ నుండి బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పదిమంది వ్యక్తుల పేర్లు చెబితే, నేను ఆరెస్సెస్‌లో చేరి, ఆ సంస్థ కోసం ఊరూరూ తిరిగి ప్రచారం చేస్తానని” తమిళ నటుడు సత్యరాజ్‌ సవాలు విసిరారు. ఈ సవాలును ఎవరూ స్వీకరించలేరు.

జాతీయోద్యమానికి దూరంగా ఉండి కూడా జాతీయ వాదులమని చెప్పుకోగల ఘనత ఒక్క ఆరెస్సెస్‌కే చెల్లింది. జాతినంతా ఏకతాటిపైకి తీసుకువచ్చి పోరాటానికి నాయకత్వం వహించిన గాంధీని హత్య చేసిన హంతకుడు నాధూరాం గాడ్సే స్వయం సేవక్‌ సంఘీయుడు, దీనికి పురికొల్పిన సావర్కర్‌ వీరి ఆరాధనీయుడు. ఇదీ వీరి ఘన చరిత్ర. అట్లాంటి చరిత్రకు వారసత్వంగా ఉన్న ఆరెస్సెస్‌ వందేండ్ల సందర్భంగా స్మృతి చిహ్నాలను విడుదల చేయటం, భారత రాజ్యాంగానికి అవమానం, తీవ్ర గాయం తప్ప మరొకటికాదని సీపీఐ(ఎం) ప్రకటించడం వాస్తవమైనది. భారతీయ జీవన విధానానికి, భిన్నత్వంలో ఏకత్వానికి పూర్తి వ్యతిరేకమయిన మతతత్వ ఆలోచనా ధోరణి ఆరెస్సెస్‌ది. ప్రజలను మత ప్రాతిపదికన విభజన చేయటం వారి లక్ష్యం. ప్రజాస్వామిక ఆచరణ, లౌకిక విలువల పరిరక్షణ, సమానత్వ భావనల ఆధారంగా నిర్మించుకున్న రాజ్యాంగం బదులుగా మను ధర్మశాస్త్రం ప్రకారం పాలన సాగాలని కోరుకునే ఆరెస్సెస్‌కు ఎన్ని ఏండ్లు నిండిన ఏమి మేలు జరుగుతుంది ప్రజలకు! హిట్లరు యుద్ధోన్మాద అనుచరులకు అభినందన కొనసాగటం ఓ విషాదం. రాజ్యాంగాన్ని, దాని విలువలను కాపాడుకోవటం నేటి మన కర్తవ్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -