- Advertisement -
ప్రైమ్ వాలీబాల్ నాలుగో సీజన్
హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) లో ఐదు సెట్ల థ్రిల్లర్స్ అభిమానులను అలరిస్తున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో అహ్మదాబాద్ డిఫెండర్స్ 3%-%2 (13-15, 13-15, 15-13, 15-8, 18-16) సెట్ల తేడాతో ఢిల్లీ తూఫాన్స్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు సెట్లు ఓడి ఓటమి అంచుల్లో నిలిచిన అహ్మదాబాద్ గొప్పగా పుంజుకొని ఢిల్లీని ఓడించింది. అద్భుత ప్రదర్శన చేసిన అహ్మదాబాద్ జట్టు ఆటగాడు అంగముత్తు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు.
- Advertisement -