రైతులకు రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి విజ్ఞప్తి
ఈ నెల 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈ నెల 21 నుంచి సీసీఐ అధికారికంగా పత్తి కొనుగోళ్లు ప్రారంభించనుందని రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి తెలిపారు. అప్పటివరకు తొందరపడి ప్రయివేటు వ్యాపారులకు తక్కువ ధరకు పత్తి అమ్ముకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అంతకు ముందు ఆయన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఉన్నతాధికా రులతో ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. రైతులు పత్తి పంట అమ్మకాల సమయంలో దళారుల చేతుల్లో మోసపోతున్నారని సీసీఐకి వివరించినట్టు పేర్కొన్నారు.
సీసీఐ కొనుగోలు చేసే క్రమంలో కొంతమంది దళారుల జోక్యం ఉంటుందని సీసీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. గతేడాది సకాలంలో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తిలో తేమ 12 శాతం ఉన్నా కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. పత్తిని పొలాల నుంచి కొనుగోలు కేంద్రాలకు సంచులాల్లో కాకుండా ఓపెన్‌గానే తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 6న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, సీసీఐ ఉన్నతాధికారులతో సమావేశం జరగనుందని ఆయన తెలిపారు.
ప్రయివేటు వ్యాపారులకు పత్తి అమ్మకండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES