నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైద్య అనుబంధ వృత్తి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. శనివారం హైదరాబాద్ పంజగుట్టలోని నిమ్స్ లెర్నింగ్ సెంటర్‌లో జరిగిన వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల విద్యార్థుల ఓరియెంటేషన్ ప్రోగ్రాంలో ఆయన 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ పొందిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నిమ్స్‌లో సీటు లభించడం అదృష్టంగా భావించాలని కోరారు. నిమ్స్ దేశంలోనే అత్యంత ఆధునిక రోగ నిర్ధారణ యంత్ర పరికరాలు, నిష్ణాతులైన సాంకేతిక సిబ్బంది, అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది ఉన్న సంస్థ అని తెలిపారు. అలాంటి సంస్థలో శిక్షణ పొందడం ద్వారా విశాలమైన అవకాశాలు అంది పుచ్చుకో వచ్చని వివరించారు.
మెడిసిన్‌లో సీటు రాలేదని బాధపడొద్దని సూచించారు. వచ్చిన అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ ద్వారా సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకా శాలు మెండుగా ఉంటాయని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో తాము ఎంచుకున్న కోర్సులో సుశిక్షితులు కావాలని ఆకాంక్షించారు. ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డాక్టర్ శాంతి వీర్, కళాశాల ప్రిన్సిపాల్ శిరందాస్ శ్రీనివాస్, కో ఆర్డినేటర్ దామోదర నాయుడు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.
వైద్య అనుబంధ వృత్తి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES