Sunday, October 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచెడుపై మంచి సాధించిన విజయమే దసరా : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

చెడుపై మంచి సాధించిన విజయమే దసరా : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

- Advertisement -

ఆయనకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన చింతల శ్రీనివాస్‌ ముదిరాజ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలంగాణ సాంస్కతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉన్నదని, చెడు పై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దేశవ్యాప్తంగా విజయదశమి దసరా పండుగను జరుపుకుంటామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఈ పండుగకు శుభసూచికంగా పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణలో ప్రత్యేకమని తెలిపారు. దసరా పండుగను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అంబర్‌పేటలో బీజేపీ సీనియర్‌ నాయకులు చింతల శ్రీనివాస్‌ ముదిరాజ్‌ జమ్మి ఇచ్చి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగను జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏడెల్లి అజయ్ కుమార్‌, సెంట్రల్‌ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కిన్నెర మేశ్‌ యాదవ్‌, బీజేపీ నాయకులు కెంచె చంద్రశేఖర్‌, ఎడెల్లి భాస్కర్‌, రాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -