Sunday, October 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

- Advertisement -

అప్రమత్తమైన జలమండలి
ఉస్మాన్‌సాగర్‌ 6 గేట్లు, హిమాయత్‌సాగర్‌ 2 గేట్ల ద్వారా నీటి విడుదల


నవతెలంగాణ-సిటీబ్యూరో
వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయడంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు పైనుంచి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడూ బయటకు వదులుతున్నారు. శనివారం జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి జంట జలాశయాలను సందర్శిం చారు. రెవెన్యూ, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటి కప్పుడూ వరద పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యం చేయొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్ర మత్తం చేయాలన్నారు.

ఉస్మాన్‌సాగర్‌(గండిపేట) రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో 6 గేట్లను 4 అడుగుల మేర ఎత్తిన అధికారులు 2652 క్యూసెక్కులు నీటిని మూసీలోకి వదులు తున్నారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌కు 600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగు తోంది. హిమాయత్‌సాగర్‌ జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ఇప్పటికే రిజర్వాయర్‌ పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువలో నీరు ఉండటంతో 2 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 2000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌కు 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆరెంజ్‌ అలర్ట్‌, వాతావరణ సూచనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యల్లో భాగంగా హిమాయత్‌సాగర్‌ నుంచి దశలవారీగా నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -