Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లెల్లో వేడెక్కిన రాజకీయం.!

పల్లెల్లో వేడెక్కిన రాజకీయం.!

- Advertisement -

మొదలైన హడావుడి
ఓటర్ల మద్దతుకు ఆశావహుల పాట్లు
నవతెలంగాణ – మల్హర్ రావు

స్థానిక సంస్థలకు ఎన్నికల నగారా మోగడంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. ఆశావహులు టికెట్ల కోసం తమ ప్రయత్నాల్లో నిమగ్న మయ్యారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యులు,సర్పంచులుగా నిలబడేందుకు యువత సైతం ఉవ్విళ్లూరుతోంది. నాయకులను, ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆత్మీయ పలకరింపులు, దావత్లు, అభివృద్ధి కార్యక్రమాల హామీలు, కుల సంఘాలతో భేటీలతో తీరక లేకుండా గడుపుతున్నారు. మండలంలో 7 ఎంపిటిసిలు,15 సర్పంచ్ లు,128 వార్డులు, ఒక జెడ్పిటిసి,ఒక ఎంపిపి స్థానాలున్నాయి.

ఔత్సాహికుల సందడి..

స్థానిక ఎన్నికల ప్రకటన రావడంతో పల్లెల్లో ఔత్సాహితుల సందడి నెలకొంది.పోటీకి దిగే ఆలోచన ఉన్న వారు మద్దతు కూడగడుతు న్నారు. సర్పంచి ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. సర్పంచ్ గా పోటీ చేయాలనే అభ్యర్థులు కుల సంఘాలను కలవడం ప్రారంభించారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలోకి దిగాలనుకునే వారు రిజర్వేషన్లు రావడంతో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి పార్టీ నుంచి బీఫాం ఎలాగైనా దక్కించుకునేందుకు కసరత్తులు ప్రారంభించారు. రిజర్వేషన్లు అనుకూలించని వారు నిరుత్సాహంతో ఉండిపోతున్నారు.

గెలుపు గుర్రాల కోసం అన్వేషణ..

ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీనికి అనుగుణంగానే అధికారులు ఇప్పటికే రిజర్వేషన్లను ప్రకటించారు.ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించెందుకు సన్నద్ధమైయ్యారు.ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయి నుంచి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాల ఎన్నికలు పార్టీ ప్రతిపాదికన నిర్వహిస్తారు. అభ్యర్థులు పార్టీ బీఫాంపై పోటీ చేసి విజయం సాధించాల్సి ఉంటుంది. దీంతో ఆయా పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలు పెట్టాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -