- Advertisement -
మద్దతు ధర ప్రకటించాలి : రైతులు
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రకటించాలని మండల రైతులు ప్రభుత్వాన్ని ఆదివారం డిమాండ్ చేశారు. జక్రాన్ పెళ్లి మండల కేంద్రంలో రైతు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని జై గంగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ని కోరడం జరిగింది. మద్దతు ధర రూ.2400/- మద్దతు ధరతో కొనుగోలు చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు జై డి గంగ రెడ్డి , నరెడ్ల చిన్న సాయి రెడ్డి, నిఖిల్ రెడ్డి, జెడి చిన్న గంగారం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -