Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్హర్ మండలం.. మగువకే మకుటం.!

మల్హర్ మండలం.. మగువకే మకుటం.!

- Advertisement -

ఎస్సీ మహిళకు ఎంపీపీ, జెడ్పీటిసి పిఠాలు..
సగం సర్పంచ్ లు కూడా వారే..
నవతెలంగాణ – మల్హర్ రావు

మల్హర్ రావు మండలం మహిళా శక్తి మరింత బలపడుతోంది.విద్య, ఉపాధి రంగాల్లోనే కాదు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవ హరిస్తున్నారు. లీడర్షిప్ తో పాటు ఇతర అభ్యర్థుల గెలుపోటములను సైతం నిర్ణయిస్తూ..పురుషులకు ఏమాత్రం తీసిపోబోమని నిరూపిస్తున్నారు. ఈసారి స్థానిక సంస్థల రిజర్వేషన్లలోనూ అతివలకు పెద్దపీట వేశారు.దాదాపు పదిహేను ఏళ్ల తర్వాత ఎస్సి మహిళకు జెడ్పీటిసి, పదేళ్ల తరువాత ఎస్సికి ఎంపిపి పిఠాలు రిజర్వ్ కాగా తొలిసారిగా మహిళా అభ్యర్థి(ఎస్సీ)ఎంపిపి ఆసీను కానుంది. ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. ఇక మండల వ్యాప్తంగా 7 ఎంపిటిసి స్థానాలు ఉండగా, వీటిలో రెండు సీట్లను మహిళలకు,మిగతా 5 ఎంపీటీసీ స్థానాలకు మహిళ/పురుషులు కేటాయించారు. ఇక 15 సర్పంచ్ స్థానాలల్లో 6 మహిళలకు,8 స్థానాలు మహిళ/పురుషులు,128 వార్డులు ఉండగా.. 45శాతం స్థానాలను మగువలే దక్కించుకోనున్నారు. గతంతో పోలిస్తే ఈసారి వీరి సంఖ్య కొంత తగ్గినప్పటికీ.. మెజార్టీ స్థానాల్లోనూ కీలకం కాబోతున్నారు.

ఆత్మీయ పలకరింపులు..

స్వయంగా పోటీలో నిలబడటంలోనే కాదు ఇతర అభ్యర్థుల గెలుపు ఓటముల్లోనే మహిళల ఓట్లే కీలకంగా మారబోతున్నాయి. మహిళలు మాత్రమే అభ్యర్థుల తలరాతలను మార్చగలరు. మండల వ్యాప్తంగా 15 జిపిల్లో 22,446 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 10,967,మహిళలు 11,479 మంది ఉన్నారు. బరిలో ఉన్న తోటి మహిళల గెలుపులోనే కాదు.. ఓటమిలోనే వీరే ఓట్లే కీలకం కాబోతున్నారు. మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ఇప్పటికే వారి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టారు. గతంలో మచ్చుకైనా మాట్లాడని పురుష నాయకులు ప్రస్తుతం..అక్కా,అత్తా, చెల్లి, అమ్మా..అమ్మమ్మా అంటూ కొత్త వరసలు కలుపుతున్నారు. ఆత్మీయంగా పలకరిస్తూ మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వీరు ఎవరిని ఆశీర్వదిస్తారో.. తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -