Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్24/7 ఆస్పత్రి విధుల్లో ఒక్కరుండడమేంటి ?

24/7 ఆస్పత్రి విధుల్లో ఒక్కరుండడమేంటి ?

- Advertisement -
  • ఆస్పత్రి సందర్శనలో కలెక్టర్ హైమావతి ఆగ్రహం
  • సిబ్బంది విధుల్లో ఉండేల చర్యలకు అదేశాలు..
  • నవతెలంగాణ-బెజ్జంకి
  • 24/7 ఆస్పత్రిలో విధుల్లో ఒక్కరుండడంమేంటని కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టాఫ్ నర్స్ పద్మ ఒక్కరే విధులు నిర్వహిస్తుండడంతో ఇతర సిబ్బంది విధుల్లో ఉండేల చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని అదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం తోటపల్లి గ్రామ స్టేజ్ వద్ద రాజీవ్ రహదారిపై ఏర్పాటుచేసిన ఎస్ఎస్ టీ శిబిరాన్ని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అదేశానుసారం ఎస్ఎస్ టీ సిబ్బంది 24/7 అత్యంత పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తూ తనిఖీలు నిర్వహించాలని హెచ్చరించారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -