నవతెలంగాణ – పెద్దవూర
చెన్నై లోని తాభరం ప్రాంతంలో ఎస్ ఎల్ వీ ఈ టీకళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ అటెండ్ లార్జెస్ట్ కరాటే డిస్ప్లే నందు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన పాతనబోయిన సుదీక్ష , పాతనబోయిన విహాస్ వరల్డ్ భాగస్వామ్యులు అయ్యారు. ఇట్టి గిన్నిస్ రికార్డు నందు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు , కర్ణాటక , కేరళ కు చెందిన పలువురు కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు మాట్లాడుతూ .. ఇట్టి గిన్నిస్ రికార్డు సాధించడం సంతోషంగా ఉందని తమపై బాధ్యత కూడా పెంచిందని మునుముందు మరింత కఠోరశ్రమతో సాధన చేసి మరెన్నో అంతర్జాతీయ పతకాలు సాధించి పుట్టిన ఊరికి, తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకువస్తామని తెలిపారు. చిన్ననాటి నుండే శిక్షణ ఇప్పించి నిరంతరం తమవెంట ఉండి నడిపిస్తున్న తల్లితండ్రులకు ,శిక్షణలో మెళకువలు నేర్పించి మంచి మంచి అవకాశాలు ఏర్పాటు చేసిన కోచ్ మహేష్ నాయకు ధన్యవాదాలు తెలియచేశారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ భాగస్వాములు అయిన చిన్నారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES