Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేనా.?

స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేనా.?

- Advertisement -

ఎక్కడ చూసినా కోర్టుల తీర్పుపైనే వినబడుతున్న చర్చలు..
నవతెలంగాణ – మద్నూర్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై వ్యతిరేకిస్తూ పలువురు కోర్టులకెక్కారు. ఒకరు సుప్రీంకోర్టులో కేసు వేయగా ..మరొకరు హైకోర్టులో కేసు వేశారు. సుప్రీం కోర్టులో ఈనెల 6న, హైకోర్టులో ఈనెల 8న తీర్పులు రానున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికల కోసం ఈ నెల 9 నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించనుంది. అభ్యర్థుల ఎంపికలు కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, పార్టీలు ముమ్మర కసరతులు చేపడుతున్నప్పటికీ, కోర్టులో ఎలాంటి తీర్పులు వెలబడతాయి అనేది ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో దింపేందుకు అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలపై ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఎన్నికలు జరుగుతాయా జరిగయా అనే చర్చలే జోరుగా వినబడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. అంతిమంగా కోర్టులు ఆమోదముద్ర వేస్తేనే అడుగుముందుకు పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చివరకు ఏం జరుగుతుందో అందరి లాగే మనమూ ఈ నెల 8 వరకు వేచి చూడక తప్పదు!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -