నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత నాలుగు రోజులుగా నేటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలువురు కాలనీవాసులు ఆదివారం తెలిపారు. కాలనీలో ఉన్న మినీ వాటర్ ట్యాంక్ కు సరైన నీటి సరఫరా లేక ట్యాంక్ నిండడం లేదన్నారు. కాలనీలో ఉన్న పెద్ద ట్యాంక్ నిండి ఓవర్ ఫ్లో అయితే ఆ నీటితో ఈ మినీ వాటర్ ట్యాంక్ నిండేదని పలువురు కాలనీవాసులు తెలిపారు. గత నాలుగు ఐదు రోజులుగా పెద్ద వాటర్ ట్యాంక్ నిండడం లేదని, దీంతో ఓవర్ ఫ్లో లేక మినీ వాటర్ ట్యాంక్ లోకి నీటి సరఫరా లేదన్నారు.
మినీ వాటర్ ట్యాంకు నీటి సరఫరా లేకపోవడంతో కాలనీలో నీటి సమస్యలు ఏర్పడ్డట్లు వారు తెలిపారు. అయితే పెద్ద వాటర్ ట్యాంక్ నిండక పోవడానికి కారణాలేంటని గ్రామపంచాయతీ సిబ్బందిని వాకబు చేయగా గ్రౌండ్ వాటర్ లేక బోర్లు పోయడం లేదని పేర్కొన్నారు. ఒకపక్క నిరంతరం వర్షాలు కురుస్తూనే ఉన్న నేపథ్యంలో బోర్ గ్రౌండ్ వాటర్ లేదని గ్రామ పంచాయతీ సిబ్బంది చెప్పడం విడ్డూరంగా ఉంది. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి ఎస్సీ కాలనీలో నీటి ఇబ్బందులు తీర్చాలని కాలనీవాసులు కోరుతున్నారు.
కమ్మర్ పల్లి ఎస్సీ కాలనీలో నీటి సమస్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES