- Advertisement -
హరీష్ రావును వేడుకున్న గిరిజన మహిళలు..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
మమ్మల్ని ఆదుకోండి సారు అని బంజారా తాండకు చెందిన గిరిజన మహిళలు సిద్దిపేట మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును వేడుకున్నారు. ముంపు పంటల పరిశీలనకు వచ్చిన హరీష్ రావును గిరిజన మహిళలు ఆదుకోండి సారూ అన్ని కోల్పోయాం అని వేడుకున్నారు. భారీ వర్షాల కారణంగా పంటలను మునిగిపోయాయి, రైతు బంధు పడలేదు నెలకి 2500 ఇస్తానన్న 2500 ఇస్తలేరు అని వేడుకున్నారు. అన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తారమ్మ అని హరీష్ రావు బదులిచ్చారు. మాటల ప్రభుత్వమే గాని చేతల ప్రభుత్వం కాదని ప్రతివ చేశారు.
- Advertisement -