– ఆటపాటలతో సందడి చేసిన పూర్వ విద్యార్థులు
నవతెలంగాణ – కోహెడ
పూర్వ విద్యార్థుల సమ్మేళనం గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కలిపే బావోధ్వేగ వారధి అని చెప్పవచ్చు. ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-2004 సంవత్సరంలో పదోతరగతి పూర్తయిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని వెంకటేశ్వర గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా తమ చిన్న తనంలో బోధించిన గురువులను పూలమాలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే తమ చిన్నతనంలో చదువు పూర్తయిన తర్వాత జీవిత లక్ష్యాల సాధనలో వివిధ ప్రాంతాలలో స్థిరపడి ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతలతో గడుపుతున్న తీరును ఒకరికొకరు చర్చించుకున్నారు. తరగతి గదిలో చిన్నతనంలో చేసిన అల్లరులను, గురువులు నేర్పిన విద్యాబుద్దులను నెమరువేసుకున్నారు. అలాగే 21 సంవత్సరాల అనంతరం ఒకరినొకరు కలుసుకొని ఆటపాలతో సందడిగా గడిపారు. ఈ కార్యక్రమంలో 2003-2004 సంవత్సరం పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
సంతోషంగా ఉంది..
తరగతి గదిలో చేసిన అల్లరులను మరోమారు పంచుకున్న తీరు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఈ కలయికతో చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం వారి బాగోగులను తెలుసుకోవడం మానసిక ఉల్సాసాన్ని కలిగించింది. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలతో పాటు, పూర్వ విద్యార్థుల కలయికను నిర్వహించుకునే దిశగా బాటలు వేస్తాం – నంగునూరి కిరణ్ ( జర్నలిస్ట్ )
స్నేహబంధాల పునరుద్ధరణ
పాత స్నేహితులను కలుసుకోవడంతో మళ్ళీ ఉల్లాసం నిండి, ఒంటరితనం తగ్గుతుంది. అలాగే స్నేహబంధాలు పునరుద్ధరణ చెందుతాయి. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన గురువులను సన్మానించుకునేందుకు మంచి వేదికగా ఉంది. తమ వృత్తి అనుభవాలను పంచుకోవడం, సరైన మార్గాలను సూచించుకునేందుకు అందరి కలయిక సంతృప్తినిచ్చింది – గాదాసు శ్రీనివాస్ ( ఐకెపీ కంప్యూటర్ ఆపరేటర్ )