Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాడబోయిన రవిని పరామర్శించిన సూర్య 

కాడబోయిన రవిని పరామర్శించిన సూర్య 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట 
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మండల బీసీ సేల్ అధ్యక్షులు కడబోయిన రవి ని ఆదివారం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజ సూర్య పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. హనుమకొండలోని కళ్యాణి హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది రవి ని పరామర్శించి రవికి అందుతున్న  చికిత్సపై వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. త్వరలోనే కోలుకొని ఎప్పటి మాదిరిగా పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటారని ధైర్యంగా ఉండాలని రవిని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి మాజీ ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి అనిల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పులుగుజ్జు వెంకన్న  తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -