నెల రోజులు గడుస్తున్నప్పటికీ నిరుపయోగంగా కంటైనర్
టీ స్టాల్ ఏర్పాటుతో ఎంపీడీవో కార్యాలయానికి వాస్తు దోషమట!
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు బేకాతర్
నెరవేరని కలెక్టర్ మహిళా సాధికారిక కళ
నవతెలంగాణ-పాలకుర్తి
మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు చిన్న,చిన్న వ్యాపారాలను ప్రోత్సహించాలన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కళ నెరవేరడం లేదని విమర్శలు ఉన్నాయి. మండల కేంద్రాల్లో మండల సమైక్య, గ్రామ సమైక్యల సహకారంతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా వనిత టీ స్టాళ్లను ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాల ఆవరణలో సలేంద్ర కళ్యాణి, పోలీస్ స్టేషన్ సమీపంలో పెనుగొండ అనిత, శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో ఆకుల లక్ష్మీలకు వనిత టీ స్టాల్ నిర్వహణకు అనుమతులు ఇచ్చారు.
పోలీస్ స్టేషన్, శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ సమి ఆలయ ఆవరణలో అవకాశం లేకపోవడంతో ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాల ఆవరణలో వనిత టీ స్టాల్ ను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకునేందుకు సలేంద్ర కళ్యాణికి అవకాశం రావడంతో మండల, గ్రామ సమైక్యల సహకారం తీసుకోకుండానే లక్ష్యా 30 వేలు అప్పుచేసి వనిత టీ స్టాల్ కంటైనర్ను కొనుగోలు చేసి నెల రోజులు గడుస్తున్నప్పటికీ వనిత టీ స్టాల్ నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు.
ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో గల వనిత టీ స్టాల్ ను ఏర్పాటు చేసుకునేందుకు సలేంద్ర కళ్యాణి ఏర్పాట్లను చేసుకోవడంతో ఎంపీడీవో కార్యాలయం ఇంకుడు గుంత సమీపంలో టీ స్టాల్ ను ఏర్పాటు చేయరాదని అధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఎంపీడీవో కార్యాలయం ఇంకుడు గుంత సమీపంలో టీ స్టాల్ ను ఏర్పాటు చేస్తే ఎంపీడీవో కార్యాలయానికి వాస్తు దోషం పొంచి ఉండే ప్రమాదం ఉందని ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది ఎంపీడీవోకు వివరించడంతో వనిత టీ స్టాల్కు అడ్డంకులు ఏర్పడ్డాయి. నిర్హకురాలు కోరుకున్న ప్రదేశంలో టీ స్టాల్ ను ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డి ఆర్ డి ఓ పి డి వసంత, జిల్లా పంచాయతీ అధికారిని స్వరూపలు ఎంపీడీవోకు ఆదేశించినప్పటికీ టీ స్టాల్ ఏర్పాటుకు, ప్రారంభానికి గ్రహణం వీడలేదు.
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారులతో పాటు జన సందోహం ఎక్కువగా ఉండటం, వనిత టీ స్టాల్ ప్రారంభం కాకపోవడం టీ స్టాల్ నిర్వాహకురాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. వనిత టీ స్టాళ్లను ఏర్పాటు చేయడంతో మహిళల ఉపాధి అవకాశాలతో పాటు జీవన ప్రమాణాలను పెంపొందించి సమాజానికి స్ఫూర్తిగా నిలిచేందుకు మహిళల అభ్యున్నతి కోసం కలెక్టర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. వనిత టీ స్టాల్ తో పాటు జిరాక్స్ సెంటర్, భోజన వసతి కల్పించేందుకు దోహదపడుతుందని కలెక్టర్ ప్రత్యేక దృష్టిని పెట్టి మహిళలు చిన్న, చిన్న వ్యాపారాలు నిర్వహించుకుని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న కలెక్టర్ ఆకాంక్ష నేటికీ నెరవేరడం లేదు.
ఎంపీడీవో కార్యాలయానికి వాస్తు దోషం పేరుతో వనిత టీ స్టాల్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి వనిత టీ స్టాల్ ను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వాస్తు దోషం పేరుతో టీ స్టాల్ ను ప్రారంభించకుండా అధికారులే అడ్డుపడడం సబబు కాదని పలువురు విమర్శిస్తున్నారు. టీ స్టాల్ నిర్వహణ పట్ల ఎంపీడీవో రవీందర్ ను ఆదివారం వివరణ కోరగా టీ స్టాల్ ను ఎన్నికల కోడ్ సందర్భంగా నిర్హకురాలే టీ స్టాల్ ను ప్రారంభించుకోవచ్చని తెలిపారు.
వనిత టీ స్టాల్ ప్రారంభం ఎప్పుడో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES