- – రసమయికి కాంగ్రెస్ జిల్లాధికార ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి ప్రశ్న
– అట్రాసిటీ కేసులపై మాట్లాడేర్హత మీకులేదంటూ అగ్రహం - – డ్రగ్స్ పై నార్కోటిక్ పరీక్షలకు సిద్దమాంటూ సవాల్
- నవతెలంగాణ-బెజ్జంకి
- అధికారముందికదాని..ప్రశ్నించినవారిపై పదేళ్లలో కేసులు పెట్టించలేదాని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను కాంగ్రెస్ పార్టీ జిల్లాధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే రసమయికి తిట్ల పురాణం కొత్తేమికాదని.. అనుభవించిన అధికారాన్ని నియోజకవర్గ ప్రజలు తృణికరించడంతో ప్రజల్లో ఉనికి కోసం ఎవరు పడితే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సహజమేనని.. తన పార్టీ కార్యకర్తలపై ఎమ్మెల్యే కవ్వంపల్లి కేసులు నమోదు చేయిస్తున్నాడని రసమయి వాఖ్యలు చేయడం విడ్డూరమని రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమయి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం మండల కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి వివిధ పత్రికల్లో వచ్చిన తిట్లపురాణం వార్తలను చూపిస్తూ మాట్లాడారు.పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చనే అన్నట్టూ మాజీ ఎమ్మెల్యే రసమయి తీరుందన్నారు. పదేళ్ల పాలనలో అధికారంతో చేసిన అక్రమాలను ప్రశ్నించిన తనపై అట్రాసిటీ కేసు నమోదు చేయించి పోన్లో ఇష్టారీతిన మాట్లాడిన తిట్లపురాణాన్ని మర్చిపోయావంటూ గుర్తు చేశారు.డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వార ఎస్సీ సామాజిక వర్గాలకు అన్యాయం జరగకుండా తీసుకువచ్చిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తన స్వార్థం కోసం వినియోగించుకున్న ఘనత రసమయిది..అతని అనుచరులదని..అట్రాసిటీ కేసుపై మాట్లాడేర్హతలేదన్నారు.ఎమ్మెల్యే కవ్వంపల్లి డ్రగ్స్ తీసుకుంటున్నాడంటూ చౌకబారు ఆరోపణలు చేయడం సరైందికాదని..ఎవరూ డ్రగ్స్ తీసుకున్నారో తెల్చాల్సింది అధికారులని..నార్కోటిక్ పరీక్షలకు సిద్దమాంటూ సవాల్ చేశారు.ఎమ్మెల్యే కవ్వంపల్లిపై అనుచిత వ్యాఖ్యలు మానుకుని గౌరవంగా మెదులుకోవాలని సూచించారు.
ప్రజల సొమ్మును దోచుకున్న వలసవాది:జనాగం శంకర్
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పోరాటంలో అమరుల త్యాగ ఫలంతో..కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమిచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అత్మగౌరవ నినాదంతో గాల్లో మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన రసమయి బాలకిషన్ అభివృద్ధి పేరునా ప్రజల సొమ్మును దోచుకుని బంగ్లాలు కట్టుకున్న వలసవాదని మండలాధికార ప్రతినిధి జనాగం శంకర్ అక్రోశం వెల్లగక్కారు.డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న ఎమ్మెల్యే కవ్వంపల్లిపై అసభ్య పదజాలంతో ఆరోపణలు చేయడం..నీవు తీసుకున్న డాక్టరేట్ అందించిన జ్ఞానమిదేనాని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగాన్ని శాశ్వతంగా నివారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తే..కవ్వంపల్లిపై డ్రగ్స్ ఆరోపణలు చేయడం మీరు సృష్టించిన సంప్రదాయానికి దర్పణం పడుతోందన్నారు.
డ్రగ్స్ తీసుకున్న వారు పదేళ్ల తర్వాతైనా పరీక్షల్లో నిర్దారణవుతుందని..నార్కోటిక్ పరీక్షలకు సిద్దమని సవాల్ చేశారు.తనను ప్రజలు తనను మర్చిపోయారని మళ్లీ ఉనికి చాటుకునేందుకు వేస్తున్న పగటి బాగోతాలను బంద్ చేసుకోవాలని సూచించారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీరిచ్చిన హామీలేన్ని అమలు చేశారు?నియోజకవర్గంలో ఎందరి అర్హులకు డబుల్ ఇండ్లు ఇచ్చారు?ఎంత మందికి మూడేకరాల భూమిచ్చారు?ఎంత మందికి రేషన్ కార్డులిచ్చారు?ఎంతమంది అర్హులకు దళితబందు అందించారు?దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీపైనా ఎప్పుడైనా ఎస్సీ ఎమ్మెల్యేలు మాట్లాడారా?అంటూ ప్రశ్నించారు. దళితుడ్ని నమ్మి నియోజకవర్గ దళితులు మోసపోయారని అసహనం వ్యక్తం చేశారు.ఇప్పటికే చాలసార్లు ఎమ్మెల్యే కవ్వంపల్లిపై అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించామని హెచ్చరించారు.
సమన్వయంతో ఎన్నికలకు వెళ్తాం:దామోదర్
స్థానికంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులేరంటూ మాజీ ఎమ్మెల్యే రసమయి వాఖ్యలు చేయడం అవిజ్ఞానమని..బీ పామ్స్ ఎవ్వరికియాలో తెలియని అందోళనలో ఉన్నాడని..కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు సమన్వయంతో వెళ్తామని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ అన్నారు. మండలాధ్యక్షడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,ఆలయ ఛైర్మన్ జెల్లా ప్రభాకర్, నాయకులు గూడెల్లి శ్రికాంత్,చిలువేరు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.