నవతెలంగాణ-పాలకుర్తి
నిరుపేద కుటుంబానికి అమ్మా చారిటబుల్ ట్రస్టు అండగా నిలిచింది. పాలకుర్తి గ్రామానికి చెందిన చిట్యాల యాకన్న అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మృతి చెందడంతో మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న అమ్మా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ యతిపతి శ్రీకాంత్ ఆదివారం గుడిపెళ్లి సోమయ్య పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని సోమయ్య సహకారంతో 25 కిలోల బియ్యం తో పాటు నిత్యవసర సరుకులను మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశామని శ్రీకాంత్ తెలిపారు. దాతల సహకారంతో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చేయూతను అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ జీడి హరీష్, ట్రస్ట్ కోశాధికారి ఒర్రె కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబానికి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అండ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES