Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి 

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి 

- Advertisement -

ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పురు భూమయ్య డిమాండ్
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ

ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు వేసుకున్న పంటలు చేతులకు వచ్చినాయని కోతలకు రైతులు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కొన్ని ప్రాంతాలలో మొక్కజొన్న, సోయా రైతులు ఈ పంటలను అమ్ముకుందామన్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.05-10- 2025న ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ జిల్లాలో సుమారు 52 వేల ఎకరాల మక్కజొన్న పంట వేశారని అకాల వర్షాల వల్ల పంట నష్టపోయి దిగుబడులు తగ్గుతున్నాయన్నారు.

వచ్చిన ఆ కాస్త పంటలు రైతులు అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నరని అన్నారు. ప్రభుత్వం మార్క్ ఫైడ్ సంస్థ, సహకార సంస్థల ద్వారా మద్దతులకు క్వింటాలకు 2400 వందల రూపాయలకు కొనవాల్సి ఉండగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా వ్యాపారస్తులు ఇదే అదునుగా భావించి తక్కువ ధరలకే కేవలం క్వింటాలకు 1850 నుంచి 2000 లోపు మక్కలను కొంటూ రైతులను నిండా ముంచుతున్నారని భూమయ్య అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరలకు మక్కజొన్న, సోయా పంటలను కొనుగోలు చేయాలని భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనితో పాటు వారి ధాన్యం కూడా కోతలు ప్రారంభమైనందున జిల్లాలో సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెట్టకూడదని వెంటనే కాంటాలు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బి సాయిలు, నాయకులు, కే గోపాల్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -