Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్నేహితుని జ్ఞాపకార్థం అన్న వితరణ..

స్నేహితుని జ్ఞాపకార్థం అన్న వితరణ..

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్నేహితుని జ్ఞాపకార్థం 1992-93 పదవ తరగతి బ్యాచ్ స్నేహితుల ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం మండల కేంద్రానికి చెందిన చింత గణేష్ ఉప్లూర్ నుంచి కమ్మర్ పల్లికి వస్తూ ఉండగా దమ్మన్నపేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చింత గణేష్ మృతి చెంది సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో అతని స్నేహితులైన 1992-93 పదవ తరగతి బ్యాచ్ సభ్యులు, మృతి చెందిన తమ స్నేహితున్ని గుర్తు చేసుకుంటూ అతని జ్ఞాపకార్థం పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ అన్న వితరణ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భోజనాలు చేశారు.అంతకుముందు చింత గణేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్నేహితులు ఘనంగా నివాళులు అర్పించారు. తాజా మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, తాజా మాజీ ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్ అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరితో కలుపుగోల్పుగా ఉండే చింత గణేష్ మృతి పట్ల స్నేహితులు విచారణ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 1992-93 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు డాక్టర్ రాజేశ్వర్, రమేష్ గౌడ్, నవాబు పాషా, జిపి సురేష్, డాకూర్ రమేష్, జక్కం కిషన్, వై.గంగాధర్, పోతు నరేష్, షాకీర్ హుస్సేన్, విశ్వనాథ్, దత్తాద్రి, సంటి మోహన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -