Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీసేవ కేంద్రాల్లో అడ్డగోలు వసూళ్లు

మీసేవ కేంద్రాల్లో అడ్డగోలు వసూళ్లు

- Advertisement -

– ప్రభుత్వ నిబంధనలను పాటించని నిర్వాహకులు 
– అధికారులు తనిఖీలు చేసిన మారని తీరు 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలో మీసేవ కేంద్రాల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. వివిధ సర్టిఫికెట్ల కోసం మీ సేవ కేంద్రాలకు వచ్చే ప్రజల నుండి అడ్డగోలుగా అధిక మొత్తంలో వసూలు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. రెవిన్యూ అధికారులు తనిఖీలు చేసి హెచ్చరించిన మీ సేవ నిర్వాహకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. అధిక అధికవసుల విషయమై ప్రజలు నిలదీస్తే మా బాధలు మాకు ఉంటాయి… ఏం చేయమంటారని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.

ఇటీవల మీసేవ కేంద్రాల్లో ప్రజల నుండి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో తహసిల్దార్ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ అధికారి శరత్ తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో వివిధ పనుల నిమిత్తం మీ సేవకు వచ్చిన  ప్రజల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ తనిఖీల్లో మీ సేవ కేంద్రాల్లో అధిక వసూళ్లు చేస్తున్న విషయం నిజమని తేలిందని, ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని వెల్లడించారు. తనిఖీలు జరిపి సుమారు నెలరోజులు కావస్తున్న సదర్ మీసేవ కేంద్రాలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు.

నిబంధనలు పాటించని నిర్వాహకులు…

మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిర్దేశించిన ఏ నిబంధనలను పాటించడం లేదు. వివిధ పనుల కోసం వచ్చే ప్రజల దగ్గర ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఏ ఒక్కరికి కూడా రసీదులు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను ఆసరాగా తీసుకొని ప్రజల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు.మీసేవా కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కరువవడంతోనే నిర్వాహకులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.మీసేవ కేంద్రాల్లో దందాలను అరికట్టి సంక్రమంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -